సిరాన్యూస్, ఆదిలాబాద్
బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట: ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ,రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ పై ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ రైతుల తలరాతలు మార్చే విధంగా ఉందని రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రైతులకు భరోసా కల్పిస్తూ వ్యవసాయారంగానికి బడ్జెట్ లో కనీవినీ ఎరుగని రీతిలో 72,659 కోట్లు కేటాయించడంతో రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్త శుద్ధి అర్దం చేసుకోవచ్చన్నారు. ఇటీవలే 31 వేల కోట్ల రైతుల రుణమాఫీ తో చారిత్రాత్మక నిర్ణయం , ప్రస్తుత బడ్జెట్ లో వ్యవసాయానికి నిధుల కేటాయింపు చూస్తే దేశ చరిత్రలో రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉందో తేటతెల్లమవుతుందన్నారు. బడ్జెట్ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యయంగా ఆయన అభివర్ణించారు. రైతులే కాదు రైతు కూలీలకు కూడా భరోసా ఇచ్చేవిధంగా భట్టి విక్రమార్క సందేశమిచ్చారని అన్నారు.