సిరాన్యూస్,ఆదిలాబాద్
కంది శ్రీనివాస రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
* నిధుల విడుదల పట్ల కాంగ్రెస్ శ్రేణుల హర్షం
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి కృషి జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గానికి ఒకేసారి సీఆర్ ఆర్ గ్రాంట్ కింద 10 కోట్లు వివిధ 115 పనులకు సంబంధించి ఎస్డీఎఫ్ నిధులు 4కోట్లు మొత్తం 14 కోట్ల నిధులు మంజూరుకావడంతో కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలలో హర్షం వ్యక్తమవుతోంది.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలోని పలు వార్డుల్లో గ్రామ గ్రామాన సంబరాలు చేసుకుంటున్నారు. కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరై ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిధుల విడుదలలో తమ అభిమాన నేత కంది శ్రీనివాస రెడ్డి కృషి ఎంతో ఉందని కాంగ్రెస్.సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే , ఎంపీ కూడా కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,ఎం.ఏ షకీల్,మావల ఎంపీపీ దర్శనాల ఏవన్,ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,బండారి సతీష్,సంద నర్సింగ్,ఇమ్రాన్,జాఫర్ అహ్మద్,నాయకులు బూర్ల శంకరయ్య,అల్చెట్టి నాగన్న,మునిగేల విట్టల్, మహిళా నాయకురాలు భావన సింగ్ ఠాకూర్,షేక్ జుబేధ,అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.