సిరాన్యూస్, ఆదిలాబాద్
ఘనంగా కంది శ్రీనివాస రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
* విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు, ప్లేట్స్ పంపిణీ
కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ,అభిమానులు మిత్రులు ,శ్రేయోభిలాషుల మధ్య కంది శ్రీనివాస రెడ్డి తన పుట్టిన రోజును జరుపుకున్నారు.మెగా రక్త దాన శిబిరంతో పాటు పట్టణంలోని న్యూహౌజింగ్ బోర్డ్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేద విద్యార్దులకు తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డితో కలసి స్యూల్ బ్యాగులు అందించారు. అనంతరం రణదివే నగర్ లోని పాఠశాల విద్యార్దులకు ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్ ,కలాల శ్రీనివాస్, చంద నర్సింగ్ ,ఇమ్రాన్ , డేరా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.