సిరాన్యూస్,ఆదిలాబాద్
జయశంకర్ ఆశయ సాధనకై కృషి చేద్దాం: కంది శ్రీనివాస రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోసం ఆస్తి పాస్తులతో పాటు తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయ శంకర్ సర్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి కొనియాడారు.మంగళవారం ఆయన 90వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రొఫెసర్ జయ శంకర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. తెలంగాణా సాధన కోసం తను నన సిద్ధాంతాలనే ఒక అస్త్రంగా చేసి తెలంగాణా సాధించేందుకు వ్యూహ రచన చేసిన ఓ గొప్ప సిద్ధాంత కర్త అని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆంధ్రాపాలకుల కుట్రలు బయట పెట్టి మా నీళ్లు ,నిధులు , నియామకాలు మాకే కావాలని గొప్ప పోరాటం చేసిన యోధులు జయ శంకర్ సర్ అన్నారు.ఆయన తెలంగాణా అమర జీవి అని ఆ మహనీయుని త్యాగాల ఫలితమే తెలంగాణ అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి , సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బండి దేవిదాస్ చారి, పోరెడ్డి కిషన్,ఆవుల వెంకన్న, నాగర్కర్ శంకర్,సింగిరెడ్డి రాంరెడ్డి,రూపేష్ రెడ్డి, రావుల సోమన్న రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.