సిరాన్యూస్,ఆదిలాబాద్
ప్రధాని, అదానీ ఇద్దరూ ఒకటే: కంది శ్రీనివాసరెడ్డి
గన్ పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
ప్రధాని, అదానీ ఇద్దరూ ఒకటేనని కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ధర్నా కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేసారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ధర్నాలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రధాని, అదానీ ఇద్దరూ ఒకటేనని విమర్శించారు. దేశంలో విలువైన సంపదను అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు.ఆర్థిక పరమైన లావాదేవీలలో అదానిపై వస్తున్న లక్షల కోట్ల ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరగాలన్నారు. అదానీ నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలన్నారు.మోదీ అదాని మధ్య ఒక చీకటి ఒప్పందం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదానికి లక్షల కోట్లు దోచి పట్టారని ఆరోపణలున్నాయి. అదానీ అతని కంపెనీలపై జేపీసీ విచారణ జరిపించి కేంద్రం తమ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. అదానీ కంపెనీలో వాటాలున్నాయని ఆరోపణలెదుర్కుంటున్న సెబీ ఛైర్మన్ మాధబీ పురి బచ్ రాజీ నామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన కోరారు. తమ అధినేత రాహుల్ గాంధీ అదానీ మోదీల చీకటి ఒప్పందం గురించి పార్లమెంట్ లో ఎన్నో సార్లు ప్రస్తావించారన్నారు. విచారణ జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు