సిరాన్యూస్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్‌కు హైడ్రా రావాలి : ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి
చెరువులను పూడ్చి కబ్జా దారులు చేసిన అక్రమ నిర్మాణాలు తొలగించి, తాగునీటి వనరులను సంరక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి హైడ్రా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చెరువుల రక్షణ కు రేవంత్ లా సాహసం చేయలేదన్నారు.