మహాత్మా గాంధీ కి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

 సిరా న్యూస్,మంథని;
ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు జాతిపిత గాంధీజీ అని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు.
ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాలు, శాసన సభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ అద్వర్యంలో మంగళవారం మంథని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాలలు ఆర్పించారు.
ఈ సందర్బంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యం, అహింస గాంధీ నమ్మే సిద్దాంత మూలాలని, అన్యాయాలకు సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అతని ఆయుధాలని కొనియాడారు.
ఒక్క రక్తపు బొట్టు చిందకుండా శాంతియుతంగా స్వాతంత్య్రం తీసుకువచ్చిన ఘనత గాంధీజీది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, మంథని డివిజన్ ఎస్సి సెల్ అధ్యక్షుడు మంథని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, పట్టణ యూత్ అధ్యక్షుడు పెంటరి రాజు, మాజీ ఎఎంసి చైర్మన్ అజీమ్ ఖాన్, మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, ఎంపిటిసి బడికెల దేవమ్మ- లింగయ్య, నాయకులు మంథని శ్రీనివాస్, పర్శవేని మోహన్, బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ సెల్ నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *