సిరాన్యూస్, ఆదిలాబాద్
గణపతి వార్షికోత్సవ పూజ చేసిన లోక ప్రవీణ్ రెడ్డి దంపతులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ శ్రీ రేణుక బాలాజీ అపార్ట్మెంట్ లోగల వినాయక ఆలయం ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సవాలు మధ్య నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో లోక ప్రవీణ్ రెడ్డి శైలజ దంపతులు కోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. అపార్ట్మెంట్ అధ్యక్షుడు అయినటువంటి లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కుటుంబాలతో పాటు కాలనీవాసులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆనాడు ఇందులో ప్రతిష్టించిన వినాయక విగ్రహం ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తికరంగా ఉందని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు .ప్రత్యేక ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో అపార్ట్మెంట్ భక్తులతో పాటు కాలనీ భక్తులు పాల్గొనడం పై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి నల్ల సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు, సభ్యులు వినోద్ ,ప్రసాద్ రెడ్డి ముడుపు మౌనిష్ రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.