సిరా న్యూస్, బేల:
పిట్గావ్లో పర్యటించిన కాంగ్రేస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పిట్గావ్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. ఆదివారం ఈ మేరకు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సితారాం, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెల్సుకున్నారు. కాగా బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని వారు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అంగన్వాడీ భవన నిర్మాణం వంటి మౌళిక వసతులు కల్పిస్తామని వారు అన్నారు. గ్రామంలో పర్యటించిన వారిలో మాజీ జడ్పీటీసీ రాందాస్, యువజన కాంగ్రేస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.