సిరా న్యూస్,ఖమ్మం;
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే- అవి అంచనా వేసినట్టే- కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. భారత్ రాష్ట్ర సమితి కంచుకోటలను సైతం తుక్కు తుక్కు చేసింది. తొలి రౌండ్ నుంచే హస్తం పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్‌లో రేవంత్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన పట్నం నరేందర్ రెడ్డిని మట్టికరిపించారు. అప్పటి వరకు అపద్ధర్మ సీఎంగా ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన అడ్రస్ గల్లంతయింది. ఈ పార్టీ అభ్యర్థులందరూ దాదాపుగా డిపాజిట్లను సైతం దక్కించుకోలేకపోయారు. ఎనిమిది చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే.. అన్ని చోట్లా ఓడిపోయారు. కనీసం గట్టి ప్రతిఘటన సైతం ఇవ్వలేకపోయారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ-జనసేన మధ్య పొత్తుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేనను పట్టుకుని ఏపీలో రాజకీయాలు చేయలేం అనే అభిప్రాయం ఈ పార్టీ నేతల్లో వ్యక్తమౌతోందప్పుడే. పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫేస్ వాల్యూ ఏ మాత్రం కూడా తెలంగాణలో ప్రభావం చూపలేకపోయిందంటూ బాహటంగా చెబుతున్నారు. కాసేపట్లో గవర్నర్ తో కాంగ్రెస్ భేటీ-రేపు సీఎల్పీ మీటింగ్-తర్వాతే ప్రమాణస్వీకారంపై.. అలాంటిది- టీడీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించగలదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పొత్తు పెట్టుకున్నందున తప్పక జనసేనను కలుపుకొని వెళ్లాల్సి వస్తోందని, భారమే అయినప్పటికీ భరించక తప్పదని భావిస్తోన్నారు టీడీపీ నేతలు. అదే సమయంలో- తెలంగాణలో చవి చూసిన పరాజయం వల్ల టీడీపీ దృష్టిలో చులకన అయ్యే పరిస్థితి ఏర్పడింది పవన్ కల్యాణ్‌కు. సీట్ల కేటాయింపు విషయంలో ఎంత మాత్రం గొంతెత్తి డిమాండ్ చేయలేని దుస్థితిలోకి నెట్టేసింది. టీడీపీ ఎన్ని సీట్లను ఇస్తే అన్ని సీట్లకు జీ హుజూర్ అనాల్సిన వాతావరణాన్ని కల్పించింది.