Congress ST cell Banavat Gobind Naik: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ‌కు గుండు సున్నా

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ‌కు గుండు సున్నా
* కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానవత్ గోవింద్ నాయక్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా మిగిలిందని కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానవత్ గోవింద్ నాయక్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బుధ‌వారం నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా అధిక నిధులురాబట్టలేకపోయారన్నారు. ఇకనైనా తెలంగాణ ప్రజలు మేల్కొని రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా ప్రతీ ఒకరు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *