సిరాన్యూస్,నిర్మల్
నిర్మల్‌లో హైడ్రా ఏర్పాటు చేయాలి : కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
నిర్మల్ జిల్లా కేంద్రంలో చెరువులను పూడ్చి కబ్జా దారులు చేసిన అక్రమ నిర్మాణాలు తొలగించి తాగునీటి వనరులను సంరక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లాకు కూడా దీనిని విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్టణంలో భూమి ఇలా వందల ఎకరాల భుమి అక్రమంగా కబ్జాలకు గురైందని అన్నారు.బడా వ్యాపారవేత్తలు,నాయకులు విలువైన భూములు ఆక్రమించుకుని బినామిల పేర్ల మీద భూములు అనుభవిస్తున్నారని అన్నారు.రాజకీయ బాడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అసైన్డ్ భూములలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు, ఎల్ ఓ సి, లు జారి చేయించి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు ప్లాట్లు కట్టబెట్టి సొమ్ము చెసుకుంటున్నారన్నారు. అక్రమ కబ్జాలను నియంత్రణ చేయాలని, కబ్జాలకు గురైన భూములపై చర్యలు తీసుకోవాలని కోరారు.