సిరాన్యూస్, ఖానాపూర్
పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి
* కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
ప్రజలందరూ అత్యంత వైభవంగా ఘనంగా పొలాల అమావాస్య పండుగను నిర్వహించుకోవాలని కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడారు. సాంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు.ఈ సంవత్సరం రైతుల కష్టాలు కడతెర్చారని, శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరారు. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా స్వాగతిస్తూ,అందరికీ శుభం జరగాలని కోరారు. ప్రజానీకానికి పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.