సిరాన్యూస్, ఖానాపూర్
రైతుల కోసం బీజేపీ దీక్ష చేయడం విడ్డూరం: కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
రైతుల కోసం బీజేపీ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి ప్రాణలను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను పొట్టన పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం సూచనీయమన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినా ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. బీజేపీ చిత్తశుద్ధి ఉంటే రైతులకు మద్దతు ధర ప్రకటించి వారి పట్ల సబ్సిడీ రుణాలు కేంద్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతిగా పేరు ఉన్నటువంటి కాంగ్రెస్ ను విమర్శించడం బీజేపీకి తగదని హెచ్చరించారు.