సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి
* కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బనవాత్ గోవింద్ నాయక్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బనవాత్ గోవింద్ నాయక్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జిల్లాలో గ్రామ పంచాయతీలలో అధికారులు ప్రత్యేక చర్యలపై దృష్టి సాధించాలని కోరారు. విష జ్వరాలు బారిన పడకుండా దోమతెరలు పంపిణీ, దోమల నివారించే స్ప్రే మందులు పాకింగ్ చేయించాలి, అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, డ్రైనేజ్ పరిశుభ్రం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.