సిరా న్యూస్,నంద్యాల;
శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివశంకర్ రెడ్డి (46) కానిస్టేబుల్ గా శ్రీశైలం పోలీస్టేషన్ లొ విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం తెల్లవారుజామున శ్రీశైలం స్టేషనులోని రెస్ట్ రూములొ గన్నుతో తలపై కాల్చుకున్నాడు. కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి స్వస్థలం కర్నూలు వాసిగా పోలీసులు తెలిపారు.
==================