Cordon search: జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

సిరా న్యూస్, అనంతపురం
జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
* గ్రామాలు, పట్టణ కాలనీలలో తనిఖీలు
నేరాల నియంత్రణ కోసం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్ నిర్వ‌హించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా బుధ‌వారం త‌నిఖీలు చేప‌ట్టారు. సి.ఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, రౌడీషీటర్లను, కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా ఆరా తీశారు.ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో గోడవలకు దూరంగా ఉండాలని, సమస్యలు సృష్టించినా, కారణమైనా చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *