Cotton farmers are struggling : విలవిలలాడుతున్న పత్తి రైతులు

 సిరా న్యూస్,మహబూబ్ నగర్;
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పల్లీ పంటకు చివరకు అన్యాయమే జరుగుతోంది. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తక్కువ ధర చెల్లిస్తూ… కమీషన్ పేరిట కోతలు విధిస్తున్నారని రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. కోటి ఆశలతో పంట అమ్మకానికి తెస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని విచారంలో మునిగిపోయారు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసినా… మార్కెట్ లోనే కుప్పల వద్ద పడిగాపులు పడినా పాలమూరు జిల్లాలో పల్లీ రైతులకు నిరాశే మిగిలింది. విధిలేక తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లడమో… లేదా వచ్చినకాడికి అమ్మకమో చేయాల్సిన పరిస్థితి అన్నదాతలదీ. మార్కెట్ యార్డుల్లో ఎక్కడ చూసిన ఏ రైతును కదిలించిన కన్నీళ్ల గాధలే కనిపిస్తున్నాయి.బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రైతులు వేరుశనగ పంటన అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. పంట దిగుబడులు భారీగా రావడంతో యార్డు ఆవరణ కిక్కిరిసిపోయింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా వేరుశనగకు ధర ఆశించినంత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు. దీంతో విక్రయాలు నెమ్మదించాయి. టెండర్లు పూర్తయిన తర్వాత ప్రకటించిన ధరలు రైతులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. క్వింటాకు గరిష్టంగా రూ.7,500, కనిష్ఠంగా 4,000 ధరలు రావడంతో రైతుల తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ప్రభుత్వ మద్ధతు ధర రూ.6,377 ఉండగా అంతకమించి ధరలు లభించాల్సి ఉందని చెబుతున్నారు. కొన్ని కుప్పలకు మాత్రమే ఎక్కువ ధరలు వేసి, మిగతా కుప్పలకు మద్ధతు ధర కంటే తక్కువగా ధరలు ఖరారు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *