సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తల్లిపాలే శ్రేయస్కారం: కౌన్సిలర్ నాయిని స్రవంతి
0-6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలు శ్రేయస్కారమని కౌన్సిలర్ నాయిని స్రవంతి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆగస్టు 1నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, అంగన్వాడి స్కూల్ ఉపాధ్యాయులు గంధ్యాల చంద్రాణి, ఆయా తదితరులు పాల్గొన్నారు.