సిరాన్యూస్, ఖానాపూర్
నీటిని పొదుపుగా వాడుకోవాలి : కౌన్సిలర్ నాయిని స్రవంతి
* బోరు మోటర్ స్టార్టర్ ఏర్పాటు
నీటిని పొదుపుగా వాడుకోవాలని 4వ వార్డ్ కౌన్సిలర్ నాయిని స్రవంతి అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ నాలుగో వార్డులో భీమన్న గుడి పరిధిలోగల బోరు మోటర్ స్టార్టర్ గత కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దాని స్థానంలో నూతన స్టార్టర్‌ను బుధవారం 4వవార్డ్ కౌన్సిలర్ నాయిని స్రవంతి ఏర్పాటు చేయించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య లేకుండా పరిమితంగా ఉపయోగించాలని, నీటిని కూడా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ ఖానాపూర్ పట్టణ నాయకులు సంతోష్ , మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.