సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మోటార్‌కు మరమ్మతులు చేయించిన కౌన్సిలర్ పరిమి లత సురేష్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఐదో వార్డులో గత మూడు రోజుల నుండి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈవిషయం వార్డు కౌన్సిలర్ కు తెలియజేయగానే వెంటనే స్పందించారు. బుధవారం మున్సిపల్ సిబ్బందిని పిలిపించి వేరే మోటర్ తెప్పించి మరమ్మతులు చేయించారు. యధావిధిగా ప్రజలకు మంచినీరు అందించారు.