సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం : కౌన్సిలర్ పరిమి లతసురేష్
పుట్టిన బిడ్డకు తల్లులు వెంటనే మూర్రు పాలు ఇవ్వాలని, తల్లిపాలలోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ఐదవ వార్డ్ కౌన్సిలర్ పరిమి లతసురేష్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ లోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీ, బాలింతలకు కేంద్రాల నిర్వహకులు విధిగా పోషకాహారాన్ని అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణీలు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మైలారపు పుష్పలత, ఏఎన్ఎం పార్వతి, లావణ్య, హేల్పర్ గంగమ్మ, ఆశ వర్కర్ త్రివేణి, సునీత, పాఠశాల ఉపాధ్యాయురాలు శోభారాణి ,తదితరులు పాల్గొన్నారు.