సిరా న్యూస్, ఆదిలాబాద్:
మమ్మల్ని విమర్శించే నైతిక అర్హత జోగు రామన్న కు లేదు…
– డిసిసిబి చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
+ ప్రజాసేవ భవన్లో ప్రెస్ మీట్
+ తాము అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి చేరామని వ్యాఖ్య
+ డబ్బుల కోసం రాజకీయం చేసే చరిత్ర జోగురామన్న కే సొంతమని మండిపాటు
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే తాము బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి లోకి చేరామని… తమను విమర్శించే నైతిక హక్కు మాజీ మంత్రి జోగు రామన్నకు లేదని డిసిసిబి చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన జోగు రామన్న పై ఘాటు విమర్శలు చేశారు. రిమ్స్ లో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకోవడమే కాకుండా కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగాల ట్రాన్స్ఫర్ లలో డబ్బులు తీసుకుంటూ… ఆయన, ఆయన కుమారులు కోట్లకు పడగలెత్తింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు తన వద్ద ఏమీ లేని జోగు రామన్న కు నేడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జోగు రామన్న పదవి కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇకమీదట జోగు రామన్న నల్ల చరిత్రను దశలవారీగా విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, జంగుపటేల్, భోజారెడ్డి, సయ్యద్ సుజాత్ అలీ, శ్రీనివాస్, ఎండీ రఫీఖ్, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.