సిరా న్యూస్,అదిలాబాద్;
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారీ గ్రామంలో విషాదం నెలకొంది. క్షణికావేశంలో పురుగుల మందు తాగి షేవాడే పల్లవి (20) అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య మృతిని తట్టుకోలేక రిమ్స్ ఆసుపత్రి పక్కనే భర్త షేవాడే విజయ్(28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం జిరిగి సంవత్సరం కాక ముందే దంపతులు విగతజీవులుగా మారారు. పల్లవి పుట్టింటి నుండి వచ్చిన రోజే ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు…