సిరాన్యూస్, బోథ్
ఆదివాసీలు అన్ని రంగాలలో ఎదగాలి: కోర్టు ఏజిపి శంకర్
ఆదివాసీలు అన్ని రంగాల్లో ఎదగాలని, అందుకు చదువు ముఖ్యమని బోధ్ కోర్టు ఏజీపీ పి శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుకు వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆదివాసీలు పాల్గొని బస్టాండ్ వద్ద కొమరం భీం విగ్రహానికి పూలమాలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసా చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి డాక్టర్ సంధ్యారాణి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ , ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చంటి , తుడుం దెబ్బ నాయకులు ధ్రువ విశ్వేశ్వరరావు, కనక అమృత్, మండాడి నాగరావు, మండాడి లాలుదేవ్, ఆడం భీమ్రావు , రామిలి భోజన్న, సంగీపు ఈశ్వర్ రాజన్న, శంకర్ గోపాల్ తో పాటు స్థానిక ఎస్సై రాములు, విజయ్ కుమార్, సురేష్, కేశవ్ ఆయా గ్రామాల పటేల్ పాల్గొన్నారు.