తలమడుగు, సిరా న్యూస్
పశువుల వ్యాధి నివారణకు చర్యలు
అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం నికరా ప్రాజెక్టు కింద పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పశు వైద్య శిబిరం, గర్భ కోశ వ్యాధి నివారణ కార్యక్రమం నిర్వహించారు . కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ అధికారి ప్రవీణ్ కుమార్ జిల్లా పశు వైద్య అధికారి కిషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి కిషన్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం లచ్చంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మండల పశు వైద్య అధికారి డాక్టర్ దుద్ రామ్ రాథోడ్ మాట్లాడుతూ పశువులలో గర్భ కోశ వ్యాధి చికిత్స చేసి ఆరోగ్యంతో ఉన్నా ఆవులకు ఏక కాలంలో ఎదకు వచ్చేటట్టు చేసి కృత్రిమ గర్భధారణ చేసి దూడలను పొందే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముల్కల గంగమ్మ రాజేశ్వర్, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ శివచరణ్ , కేవికే, ఎస్ఆర్ఎఫ్ ప్రసూనా వైద్య సిబ్బంది స్వామి, సౌమ్య, గోపాల మిత్రులు జంగు, ఆశన్న, గంగన్న రైతులు పాల్గొన్నారు