సిరా న్యూస్, జైనథ్:
విద్యుత్ షాక్ తో ఆవులు మృతి…
+ లబోదిబోమంటున్న రైతు
+ నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి చెందాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ వెనకాల గల ట్రాన్స్ఫార్మర్ సమీపంలో రెండు ఆవులు మృతి చెంది ఉండడంతో, గుర్తించిన స్థానికులు పలువురికి సమాచారం అందించారు. మృతి చెందిన రెండు ఆవుల్లో ఒక ఆవు తనదిగా గ్రామానికి చెందిన రాజు గుర్తించాడు. ఇంకొక ఆవుకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తన ఆవు చనిపోవడంతో రాజు లబోదిబోమన్నాడు. తనకు పరిహారం అందించే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.