భూకబ్జాలపై గోపవరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

 సిరా న్యూస్,బద్వేలు;
గత ప్రభుత్వ హయంలో జరిగిన భూకబ్జాలపై సీపీఐ ధర్నా చేపట్టింది.ఈ ధర్న కార్యక్రమం బద్వేల్ ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని గోపవరం మండలంలోని ముఖ్యముగా మడకల వారిపల్లి పంచాయతీ, మరియు, బె తాయిపల్లి, బెడుసుపల్లి, పంచాయతీలలో వందలాది ఎకరాలు భూ కబ్జాదారులు భూమిని కబ్జా చేసి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న పట్టించుకో రెవెన్యూ అధికారులు మరి పేదోడు ప్రభుత్వ స్థలంలో రెండు సెంట్లులో గుడిసె వేసుకుంటే హుటా హుటిన రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ గుడిసె వేస్కున్నటువంటి గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేసి వారిని భయపెట్టి ఆ స్థలాన్ని భూ కబ్జాదారులకు కట్టబెట్టే దిశగా రెవిన్యూ అధికారులు వ్యవహరించే తీరును సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారు మాట్లాడుతూ గోపవరం మండల పరిధిలోని మడకల వారి పల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 953 954 నంబర్లలో గతంలో NGO లకు కేటాయించిన స్థలాలను మరియు పబ్లిక్ పర్పస్ ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగపడేటువంటి స్థలాలను సైతం కొంతమంది భూకబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టి గుడుల పేరుతో చర్చిల పేరుతో మసీదుల పేరుతో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నప్పటికీ చోద్యం చూశారే తప్ప కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరి పేదోడు అన్ని పన్నులు చెల్లిస్తూ బాడుగ ఇంట్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థలం లో గుడిసె వేసుకుంటే మరి రెవెన్యూ అధికారులు ఆ గుడిసవాసుల బెదిరించి రాత్రికి రాత్రులలో గుడిసెలు కూల్చివేసి నిప్పంటిచ్చేటువంటి ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో భూకబ్జాలను మరియు భూకబ్జాదారులను గుర్తించి కబ్జాకు గురైనటువంటి భూములు మరియు ఇళ్ల స్థలాలు మరియు పబ్లిక్ పర్పస్లు మరియు ప్రభుత్వ స్థలాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ స్థలాలు గుర్తించి పేదలకు పంపిణీ చేసే కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ తీసుకుంటుందని ఆయన రెవిన్యూ అధికారులు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ కార్యదర్శి బాలు గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య ఏఐవైఎఫ్ నాయకులు బండి అనిల్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఖాదర్ బాషా వెంకటయ్య సహాయ కార్యదర్శి ఓబులేసు పెంచలయ్య ఓబులమ్మ సుప్రజ లచ్చమ్మ గురయ్యా రాజేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *