సిరా న్యూస్, జైనథ్:
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలను తరిమికొట్టాలి
– సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలను తరిమికొట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. జైనథ్ మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరోడా బ్రిడ్జి నిర్మాణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే వేలాది మందికి రాకపోకల కోసం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నిర్లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అభివృద్ధి ఆదిలాబాద్ జిల్లాలో నోచుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంచిందని, బీఆర్‌ఎస్ కూడా అంతే చూసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సీపీఐ జిల్లా నాయకులు షేక్ బాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.అరుణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కండెల గణేష్, షేక్ హుస్సేన్, రైతు సంఘం నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.