సిరా న్యూస్, చిగురుమామిడి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ జెండా ఎగరేస్తాం: సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
* ప్రజాపాలన పేరుతో ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్ ప్రభుత్వం
* దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గింది
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా ఎగరవేసి చిగురుమామిడి మండలంలో పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకువస్తామని జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు.గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ముసుకు రాజిరెడ్డి స్మారక భవన్ లో మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాలను గెలుచుకోవడానికి శక్తివంచన లేకుండా నాయకులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందే తప్ప ఇంతవరకు ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు.రేషన్ కార్డులు,మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500,ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు.దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గిపోతుందన్నారు. దానికి నిదర్శనమే సొంతంగా ఎన్డీఏ దేశంలో అధికారంలోకి రాకపోవడమే అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల నిర్మాణ బాధ్యులు అందె స్వామి,కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి అందె చిన్న స్వామి,జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ, ముద్రకొల రాజయ్య, మాజీ మండల కార్యదర్శి తేరాల సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు రాకం ఆంజవ్వ,గ్రామ శాఖ కార్యదర్శులు ఎం. డి.ఉస్మాన్ పాషా, గందే కొమురయ్య ,కాత మల్లయ్య, అనువొజు జనార్దన్,అందె సంపత్, నాయకులు బసంతం, అంజయ్య, రవి, తిరుపతి, సంపత్, వెంకట్ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.