సిరాన్యూస్, సామర్లకోట :
పెద్దాపురం సీహెచ్‌సీని ఏరియా హాస్పిటల్ గా మార్చాలి : సీపీఎం మండల కార్యదర్శి డి. క్రాంతి కుమార్
* పెద్దాపురం పై చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాలు
పెద్దాపురం డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏరియా హాస్పిటల్ గా మార్పు చేయాలని 100 పడకల ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి డి. క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి డి. క్రాంతి కుమార్ మాట్లాడుతూ 15 ఏళ్ళ క్రితం ఏరియా హాస్పట్లగా 100 పడకల హాస్పటల్గా చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతిపాదనతోనే ఆగిపోయిందన్నారు.
డివిజన్లో కేంద్రం లో రోజుకు 500 మంది వరకు ఒపీ వస్తున్నా పెద్దాపురం హాస్పటల్ ని మాత్రం ఏరియా హాస్పట్లగా మార్చలేదానారు. గతంలో ఉపముఖ్యమంత్రి పనిచేసిన ఇప్పటి ఎం.ఎల్. ఎ రాజప్ప ఏరియా హాస్పటల్ గా మారుస్తామని భవనం నిర్మించారాని కానీ అస్పటల్ మార్పు రాలేదన్నారు. పెద్దాపురం ప్రతిపదన నాడు అనపర్తి నేడు పిఠాపురం కీ మారిపోయాయన్నారు. అనపర్తి పిఠాపురం లానే పెద్దాపురం హాస్పెటల్ ని ఏరియా హాస్పెటల్ గా మార్చాలని కోరారు. అనంతరం హిస్పటల్ సూపెరడెంట్ సతీష్ రెడ్డి కీ వినతిపత్రం ఇచ్చారు.కార్యక్రమం లో నీలపాల సూరిబాబు సిరిపురపు శ్రీనివాస్ కేదారి నాగు, డి సత్యనారాయణ, డి కృష్ణ, కూనిరెడ్డి అప్పన్న, నెక్కల నరసింహ మూర్తి, చింతల సత్యనారాయణ, వడ్డీ సత్యనారాయణ, గడిగట్ల సత్తిబాబు, సిరిపురపు మరిడియ్య, యాసలపు రమేష్, డి సత్యవతి, జి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.