సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదివాసుల హక్కలకై ఉద్యమించాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
ఆదివాసుల హక్కలకై ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్ లో గల కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుడు కొమరం భీమ్ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలా చట్టాలను హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. 2022 సంవత్సరంలో అటవీ సంరక్షణ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చి ఆదివాసులకు అడవి మీద హక్కులు లేకుండా చేసిందని ఆరోపించారు. అడవి సంరక్షకులైన ఆదివాసులను అడవుల నుండి వెళ్లగొట్టి అడవులన్నింటినీ కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధంగా చట్టం చేసిందని అన్నారు. ఈ చట్టం వలన ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది అన్నారు.ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం అంటే ఒక పండుగ లాగా జరపడం కాదు అది ఒక హక్కుల దినంగా గుర్తించాలని అన్నారు. ఆదివాసీ చట్టాలు అమలు , సమస్యల పరిష్కారం కోసం అధికారులు , ఈ ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు బండి దత్తాత్రే, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న,గంగన్న,ఆర్.సురేంద్రర్ , ఆర్.మంజుల, ఆత్రం కిష్టన్న, జిల్లా నాయకులు పి. పోచన్న,దర్శనాల నాగేష్, పవర్ జితేందర్ పాల్గొన్నారు.