CPM Darshanala Mallesh: విద్యుత్ అమరుల పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్ : సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
విద్యుత్ అమరుల పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్ : సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
* విద్యుత్ అమరులకు సీపీఎం నాయ‌కుల నివాళి

విద్యుత్ అమరుల పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్ అని సీపీఎం జిల్లా కార్య‌దర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. బుధ‌వారం విద్యుత్ అమర వీరుల సంస్మరణ సభను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ 2000సంవ‌త్స‌రంలో జ‌రిగిన విద్యుత్ పోరాటం నాటి ప్రపంచ బ్యాంకు కు ఏజెంట్ గా పనిచేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చింది అని అన్నారు .నాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రయివేటీ కరణ చేసే భాగంలో విపరీతమైన చార్జీలను పెంచింది ,భరించలేని ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. 2000సంవ‌త్సరం ఆగస్టు 28 న ఛలో అసెంబ్లీ నిర్వహించిన ర్యాలీ పై పోలీసులు తుపాకీ గుండ్ల వర్షం కురిపించారన్నారు. అందులో వేలాది మందికీ గాయాలు కాగా సీపీఎం పార్టీ నాయకులు రామకృష్ణ ,విష్ణువర్ధన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాలస్వామి నేలకొరిగారన్నారు. ఆనాటి పోరాట ఫలితంగానే తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను తీసుకువచ్చింద‌ని తెలిపారు. విద్యుత్ పోరాట అమరుల స్పూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని అయన పిలుపునిచ్చారు . కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న ,నాయకులు లింగాల చిన్నన్న ,అగ్గిమల్ల స్వామి ,చిల్ల సుజాత ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *