సిరా న్యూస్,విశాఖపట్నం;
ఆకాశాన్ని తాకుతున్న నిత్యవసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్ లో సిపిఎం నాయకులు నిరసన ప్రదర్శనకి దిగారు.. గత 20 రోజులుగా నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగి పేదవాడికి భారంగా మారుతున్నాయని సిపిఎం నాయకులు ఆగ్రహ వ్యక్తం చేశారు… బ్లాక్ మార్కెట్లో ఎక్కువ అవ్వడం వల్ల నిత్యవసర సరుకులకు ధరలు అధికంగా పెరుగుతున్నాయి అన్నారు.. తక్షణమే బ్లాక్ మార్కెట్లను అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యవసర ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళారీల దోపిడీకి సహకరిస్తున్నాయని సిపిఎం నాయకులు మండిపడ్డారు…