సంత జూటూరులో పిచ్చికుక్క సైర్య విహారం..,

నాలుగు సంవత్సరాల చిన్నారిపై పిచ్చికుక్క దాడి…

సిరా న్యూస్,
బండి ఆత్మకూరు;
బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంత జూటూరు గ్రామంలో గత రెండు రోజుల నుండి పిచ్చికుక్క సైదే విహారం చేస్తూ గ్రామస్తులపై దాడి చేస్తున్న గ్రామపంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం గ్రామానికి చెందిన తెలుగు నాగరాజు కుమారుడు తెలుగు వెంకట నాగచక్రి నాలుగు సంవత్సరాల బాలుడిపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. మంగళవారం కంటి వద్ద అయినా తీవ్రమైన గాయానికి ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ బాలుడిని గాయపరిచిన పిచ్చికుక్క గ్రామంలో పలువురిపై గత రెండు రోజులగా దాడి చేస్తున్నడంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చర్యలు చేపట్టాల్సిన గ్రామపంచాయతీ అధికారులు తమకేమీ తెలియనట్లుగా వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యం గ్రామ ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని పిచ్చికుక్క బారి నుండి ప్రజలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *