సిరా న్యూస్,జోగులాంబ గద్వాల;
మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక చాకలి కందన్ సవారి యొక్క సీడ్ పత్తి పొలంలో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారికి గుండె ఆగినంత పనైంది. భయభ్రాంతులకు గురైన కూలీలు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.