సిరా న్యూస్, ఆదిలాబాద్:
పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఏవో వివేక్…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పార్డి-బి గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి వివేక్ పరిశీలించారు. శుక్రవారం ఈ మేరకు రైతులతో కలిసి గ్రామంలోని శనగ, జొన్న, వేరుశనగ పంట క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు సాగుచేసిన పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. నమోదు చేసిన పంటల ఆధారంగానే మార్కెట్ లో రైతుల వద్ద నుండి పంటలు కొనుగోలు చేయడం జరుగుతుందని, ఏఈవోలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రత్యక్షంగా పంటల నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఈఓ ఆనంద్, రైతులు ఉన్నారు.