సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
శ్రావణ 4వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుండే ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కోడేమొక్కులు చెల్లించుకొని, స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో
ఆర్జిత సేవలు రద్దుచేసి, లఘు దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వేదమంత్రాలతో గావించారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన జరుగుతుంది.