సిరా న్యూస్, కరీంనగర్
సాగు నీటి కోసం రైతు తండ్లాట…
పడిపోతున్న భూగర్భ జలాలు.. ఎండుతున్న పంటలు
ఆందోళనలో అన్నదాతలు
మండలంలో పంటలకు నీటి ఎదురవుతుంది. ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు ఆవిరవుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యాప్తంగా 17 గ్రామాల్లో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.ఎండల తీవ్రతకు నీరందక వరి పంట,మొక్కజొన్న, దోస పంటలు ఎండిపోతున్నాయి. వేసిన పంటలు చేతి కందాలంటే ఇంకా రెండు నెల సమయం పడుతుంది. మార్చి, ఏప్రిల్, నెలల్లో ఎండలు ఇంకా తీవ్రమవుతాయి.తాము వేసిన పంటలు చేతికందాలని అప్పులు చేసి మరీ బావులను పూడిక తీస్తున్నారు.బోర్లు వేస్తున్నారు. కానీ నీరు రావడం లేదు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు ప్రభుత్వానికి పంపి న్యాయం చేసేలాగా చూడాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
ప్రభుత్వం న్యాయం చేయాలి..
* కొంకట రవి, రైతు
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో తనకు రెండు ఎకరాలు ఉంటే యాసంగిలో ఒక ఎకరం మాత్రమే వరి పంట వేశాను.ఎండల తీవ్రతకు నీరందక వారి పూర్తిగా ఎండిపోయింది. ఎండిపోయిన వరిలో తన ఆవును మేపుతున్నాను. వరి పంట వేయడానికి ట్రాక్టర్,కూలీలకు, మందులకు కలిపి దాదాపు 40, వేల వరకు పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం న్యాయం చేయాలి.
ఐదు లక్షలు నష్టపోయాను
* కత్తుల మొగిలి, రైతు
బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తాను నాలుగు బోర్లు వేశాడు.చుక్క నీళ్లు రాలేదు. 5 లక్షలు నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి.