యాపట్ల ఉప సర్పంచ్ పబ్బతి అజయ్
నాగర్ కర్నూల్;
యాసంగి పంటలకు సాగు నీరు అందించాలనీ ,యాపట్ల ఉప సర్పంచ్పబ్బతి అజయ్ మంగళవారం విలేకర్లు సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను నమ్ముకుని రైతులు చెరువు ల కింద యాసంగి సీజన్ లో వరి పంట మరియు వేరుశనగ, తదితర పంటలు వేసుకున్నారు ఇప్పుడు పైర్లు అన్ని పొట్టతో ఉన్నాయి.. కాబట్టి చెరువులల్లో నీళ్లు లేకపోవడంతో రైతులు వేసిన పంటలు అన్ని ఎండిపోయే ప్రమాదం ఉన్నది.కావున కృష్ణానది బేసిన్ లో ఉన్న బ్యాక్ వాటర్ ని వీలైనంతవరకు కాలువల ద్వారా చెరువులకు నింపి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.