ఇసుక లారీ వ్యాపారస్తులు
సిరా న్యూస్,రంగారెడ్డి;
ఎల్బీనగర్ లోని ఆటోనగర్ న్యూ అడ్డా ఇసుక లారీ అసోసియేషన్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. పటాన్చెరు, డిండి నుండి అక్రమంగా దొంగ ఇసుక రావడంతో మా వ్యాపారాలు జరగడంలేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా వంగమర్తి, జాజిరెడ్డిగూడెం ల నుండి ప్రాజెక్టుకి పోవాల్సిన ఫిల్టర్ ఇసుక అక్రమంగా వందలాది లారీలు మార్కెట్ కు రావడంతో మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఇసుక వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ ఇసుక రావడంతో మాతోపాటు ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతుందని ఇసుక లారీ వ్యాపారస్తులు ఆరోపించారు. ఇలా అనుమతులు లేకుండా టాక్స్ లేకుండా దళారులు అక్రమ ఇసుకను హైదరాబాదుకు తరలించడంతో మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వారు వాపోయారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరుగుతుందని వారు తెలియజేశారు. దీనిపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని అసోసియేషన్ సభ్యులు జగదీష్ యాదవ్ తెలియజేశారు. కలెక్టర్ స్పందించి చర్యలు చేపడతామని తెలిపినట్లు ఆయన అన్నారు. కేవలం 15 రోజులకు ఒకసారి డిడి మాత్రమే ఇస్తున్నారని దానిని కూడా తగ్గించాలని వివరించామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.