సిరా న్యూస్,కోదాడ;
గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థ పడుతున్నారని ఒక విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకులాల్లో చోటుచేసుకుంది. విద్యార్థి తండ్రి తమ కొడుకుని చూడడానికి గురుకుల పాఠశాలకు రాగా పగిలిపోయిన కరెంటు బోర్డులు తేలిన కరెంటు తీగలు ఉన్నాయన్నారు. విద్యార్థులు స్విచ్ వేసే క్రమంలో కరెంట్ షాక్ వస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ వీడియో రికార్డ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విద్యార్థులకు తరగతి గదులలో మౌలిక వస్తు లేక అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల క్లాస్ రూమ్ లోనే హాస్టల్ గా మార్చుకొని ఉదయం క్లాసులు రాత్రికి హాస్టల్ గా ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
=========