సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

అందరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి*

ఏసిపి వెంకటరమణ
గోదావరిఖని ప్రతినిధి;
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.ఏసిపి వెంకటరమణ తెలిపారు.
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.ఆదేశాల ప్రకారం బుధవారం ఆర్జీ వన్ పరిధిలోని 11 వ బొగ్గు గని పై. సైబర్ నేరాలపై సింగరేణి కార్మికులకు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ….సాదారణగా ప్రజలు అత్యాశ,వలన సైబర్ నేరాలకు గురి అవుతున్నారని అనారు.ప్రస్తుతంసమాజంలో సైబర్.నేరగాళ్ళు.ఎన్నో
రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్యపెరుగుతుందనిఅన్నారుప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు.
మహిళలను ఎరచూపి వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఇలాంటి వాటిపైవ్యక్తిగతంగా
అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.ఈ మధ్యకాలంలో పిల్లలు,యువత ఆన్లైన్ యాప్ ల ద్వారా లోన్లు తీసుకొని ఆ డబ్బులతో రమ్మీ గేమ్,ఇతర ఆన్లైన్.గేమ్స్.ఆడుతూ
మోసపోతూ ప్రాణాలు తీసుకుంటున్నారని మీ పిల్లలు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలని, వారి ప్రవర్తన మరియు మొబైల్ ఉపయోగం పై పర్యవేక్షణ ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు,స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు.ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో,అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *