సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా, పుత్తూరు పట్టణం, పరమేశ మంగళ వద్దగల జివిఆర్ కనెక్షన్ హాల్ నందు బుధవారం ఎన్టీఆర్ కాలనీ చెందిన యువకుని పెళ్ళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త పెళ్ళి కుమారుడు పెళ్లి మండపం వద్ద ఏర్పాటు చేసిన స్వాగతం తెలిపే సిలిండర్ పేలి నారాయణవనం మండలంలో కసింమిట్ట గ్రామానికి చెందిన చాందిని 11 సంవత్సరాల చిన్నారి మృతి చెందింది.
అలాగే తిరుపతికి చెందిన రాంబో ఈవెంట్ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలిసి హుటాహుటిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద పెళ్ళి సందదిలో బాలిక స్వాగత సిలిండర్ పేలి మృతి చెందడంతో పెళ్ళి పందిళ్ళలో విషాదం అలుముకుంది. రిమోట్లో ఆపరేట్ చేయాల్సింది డైరెక్ట్ గా సిలిండర్ పెట్టడంతో ఈ ఘటన జరిగిందని మండపంలో ఉన్నవారు తెలిపారు.