CYSS Shitalkar Aravind: కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి : సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌ శీతాల్కర్ అరవింద్

సిరాన్యూస్‌,నిర్మ‌ల్‌
కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి : సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌ శీతాల్కర్ అరవింద్

నిర్మ‌ల్ జిల్లాలోని కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాల‌ని సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌ శీతాల్కర్ అరవింద్ అన్నారు. సోమ‌వారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా చాత్ర యువ సంఘర్షణ సమితి
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌ శీతాల్కర్ అరవింద్ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ కుబీర్ మండల విద్యాధికారి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నార‌ని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడని దుయ్యబట్టారు.కుబీర్ మండల విద్యాధికారి పై పలుమార్లు జిల్లా విద్యాధికారి కి కలెక్టర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ జరపట్లేదని, ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు.కుబీర్ మండలంలోని సౌనా పార్డి (కే) పాఠశాలలో ఉన్న ఏకోపాధ్యాయులను రిలీజ్ చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కుబీర్ మండల విద్యాధికారి పై విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *