సిరాన్యూస్, భీమాదేవరపల్లి
జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య
*ముల్కనూటర్లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డ్యాగలసారయ్య మాట్లాడుతూ జాతీయ స్ఫూర్తి కలిగి విద్యార్థి దశ నుండే గాంధీ టోపీ ధరించి పాఠశాలకు వెళ్లి తన యొక్క దేశభక్తిని ప్రస్ఫుటింపజేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.1930లో జరిగిన దండి ఉప్పు సత్యాగ్రహం దీక్షలో పాల్గొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పొంది దేశానికి స్వాతంత్రం సిద్ధించే వరకు దేశమంతా తిరుగుతూ యువత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంలో కీలకపాత్ర పోషించాడన్నారు. స్వాతంత్రం అనంతరం 1952లో జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికలలో సభ్యునిగా గెలుపొంది దేశ కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి కలిగించి 12 -14 గంటల పని కాలాన్ని ఎనిమిది గంటలకు కుదించి శ్రమకు తగిన వేతనాన్ని కల్పించి అనేక కార్మిక చట్టాలను రూపొందించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కు దక్కుతుందన్నారు.తపాల శాఖ మంత్రిగా,వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఊరురా తపాల కార్యాలయాలను విస్తరింప చేశారన్నారు.వ్యవసాయ భూములను గుర్తించి సాగు విస్తీర్ణాన్ని పెంచి హరిత విప్లవానికి పునాది వేశారన్నారు.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ)ని స్థాపించి 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు.మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానాన్ని ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు చెప్యాల ప్రభాకర్, మండల జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య,హుస్నాబాద్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ మాట్ల వెంకటస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలుగూరి రాజు,న్యాయవాది తాళ్లపల్లి మధుకర్,దళిత సంఘం నాయకులు బండారి సురేందర్,నక్క సునీల్,సంగటి వెంకటేశ్వర్లు,తాళ్ల పెళ్లి ఆశీర్వాదం,తాళ్లపల్లి ఐలయ్య,రుద్రారపు సంజీవ్,మాడుగుల ప్రభుదాస్, జిమ్మల భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…