సిరాన్యూస్, నాంపల్లి
ఎన్నికల హామీలను నెరవేర్చాలి : దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి మెతేపాక సాంబయ్య
* తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి మెతేపాక సాంబయ్య అన్నారు. శనివారం నాంపల్లి మండలంలోని మర్రిగూడ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. నూతన రేషన్ కార్డులు, రూ. 4 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.