సిరాన్యూస్,ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం : దళితమోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్
* రాహుల్ గాంధీ దళిత సమాజానికి క్షేమపణ చెప్పాలి
రాహుల్ గాంధీ దళిత సమాజానికి క్షేమపణ చెప్పాలని దళితమోర్చ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటన సందర్బంగా ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఎస్సీ రిజర్వేషన్‌లను తొలగిస్తామని ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ దళిత మోర్చా నాయకులు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేస్తూ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈసందర్బంగా దళితమోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ జాతులను మోసం చేస్తుందన్నారు.రాహుల్ గాంధీ రిజర్వేషన్‌ను తొలగిస్తామన్న ప్రకటన వెనక్కి తీసుకొని దళిత సమాజానికి క్షేమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి సందీప్, ధర్మాపాల్, బండారి అశోక్, దేవన్న, సునీల్, విజేయ్, కిషోర్, సంజీవ్.చేరన్ పాల్గొన్నారు.