Damaged BT Road: గుంతల రోడ్డుతో తప్పని తిప్పలు…

సిరా న్యూస్, చిగురుమామిడి:

గుంతల రోడ్డుతో తప్పని తిప్పలు…

+ అధ్వానంగా రామంచ మలకనూర్‌ రోడ్డు
+ కంకర తేలడంతో భారీ గుంతలు
+ అవస్తలు పడుతున్న గ్రామస్తులు

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని రామంచ మలకనూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డుపై గుంతలు తేలడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్లలో రోడ్డుపై బీటీ తొలగి, కంకర తేలడంతో గుంతలు పడ్డాయి. గ్రామస్తులు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక్క రోడ్డు కావడంతో, తరుచుగా రాకపోకలు చేయాల్సి వస్తోంది గ్రామస్తులు చెబుతున్నారు. బైక్‌పై ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. రాత్రి వేళ బైక్‌పై వస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వారు వాపోతున్నారు. పలుమార్లు రోడ్డు బాగు చేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన కూడ ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. అధికారులు దృష్టి సారించి గ్రామానికి కొత్త బీటీ రోడ్డు మంజూరు చేసి, తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *