సిరా న్యూస్,భీమదేవరపల్లి
రికార్డులో నమోదు చేయాలి
* ఏడిఏ కే దామోదర్ రెడ్డి
* ఎరువుల గోదాములపై ఆకస్మిక తనిఖీలు
ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ యాప్ లో నమోదు చేసిన విధంగా, రికార్డులో కూడా నమోదు చేయాలని డివిజనల్ వ్యవసాయ అధికారి ఏడిఏ కే దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ,గట్ల నర్సింగాపూర్,వంగర, మాణిక్యపూర్, ధర్మారం, గ్రామాలలోని ముల్కనూర్ కోపరేటివ్ రూరల్ బ్యాంక్ గోదాములలో ఆయన తనిఖీలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపాస్ మిషన్ ద్వారా గోదాంలో ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. అనంతరం గోదాం లోని ఎరువుల నమోదు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్జల్ పాషా, కొత్తకొండ గోదాం కీపర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.